లంచం తీసుకుంటు ఏసిబి పట్టుబడ్డ గూడూరు మండల విద్యాధికారి
మహబూబాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 8 (జనం సాక్షి):మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో అవినీతి వెలుగులోకి వచ్చింది. గూడూరు మండల ఇంచార్జ్ ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్న అయోధ్యపురం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ ₹50 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.ఈ ఘటనలో రవికుమార్‌తో పాటు మరో స్కూల్ అసిస్టెంట్ చంద్రమౌళి కూడా ఏసీబీకి చిక్కినట్లు సమాచారం. గూడూరు మండలంలోని వాగ్య తండాకు చెందిన ఉపాధ్యాయుడు రవీందర్ ఈ నెల 30న రిటైర్మెంట్ ఉండగా, తన బెనిఫిట్స్‌కు సంబంధించిన సంతకం చేయాలని కోరగా ₹150,000 వేల రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.దీనిపై రవీందర్ ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు ఉచ్చులో ఈ ఇద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఏసీబీ అధికారులు.


