12వ వార్డులో గుండు మధు ఇంటింటి ప్రచారం

 

 

 

 

 

 

భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 5 (జనం సాక్షి): మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గుండు మధు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్లను కలసి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.