హెల్మెట్ తప్పనిసరి… ఎస్సై రాజు
అరైవ్ అలైవ్ ప్రచారానికి ప్రజల మద్దతు
భీమదేవరపల్లి:ఏప్రిల్ 13 (జనం సాక్షి)
రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ ప్రచారం నాల్గో దశలో భాగంగా మండలంలోని గోలపల్లి గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముల్కనూర్ పోలీస్ ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ పెద్దలతో కలిసి రోడ్డు భద్రత కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి హెల్మెట్ వినియోగం ప్రాముఖ్యతను వివరించారు.సుమారు 100 మంది గ్రామస్తులు పాల్గొని రోడ్డు భద్రతపై ప్రమాణం చేశారు. గ్రామస్తులకు హెల్మెట్లు పంపిణీ చేయడంతో పాటు గ్రామ ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో నో ఎంట్రీ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎస్సై రాజు మాట్లాడుతూ, ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.ప్రజల సహకారంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మోహన్,గ్రామ పెద్దలు, యువకులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు


