శివాలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్టా హోమ పూజా క్రతువులు

 

 

 

 

 

 

 

 

బూర్గంపహాడ్ ఫిబ్రవరి 26 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో బ్రహ్మసూత్రం కలిగిన పురాతన శివాలయం శ్రీశ్రీశ్రీ గంగాపార్వతీ సమేత అగస్త్యేశ్వరస్వామి ఆలయం లో నూతన ధ్వజస్తంభ, జంట నాగేంద్ర, లక్ష్మీగణపతి, బాలత్రిపుర సుందరీదేవతా విగ్రహాల ప్రతిష్టా హోమ పూజా క్రతువులు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రతిష్ట పూజల్లో భాగంగా ఆలయ నిర్వాహకులు యాగశాలను ఏర్పాటు చేసి ప్రత్యేక హోమాలు, గోపూజ తదితర పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. 26న హోమాలు, విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 27న ఉదయం నుంచి ప్రత్యేక పూజలతో పాటు 11.34 గంటలకు ధ్వజస్తంభ, జంటనాగేంద్రస్వామి, లక్ష్మీగణపతి, బాలత్రిపుర సుందరి దేవతల యంత్ర ప్రతిష్టా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల పాటు నిర్వాహకులు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతిష్టలో భాగంగా 27న భక్తులకు మహాన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.