ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తా
బిఆర్ఎస్ అభ్యర్థి బరాడి రేణుక శివ
సదాశివపేట ఫిబ్రవరి 6(జనం సాక్షి)
వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని బిఆర్ఎస్ 19 వార్డు అభ్యర్థి బారడి రేణుక శివ అన్నారు. గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి బారడి రేణుక శివ మాట్లాడుతూ వార్డు ప్రజలు తనని ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధితో పాటు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి తనవంతు నిస్వార్థ సేవలు అందిస్తానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తి విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ప్రజలకు అందజేసి కాంగ్రెస్ మోసాలను ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



