దుబ్బగూడెం క్రాస్ నుండి జాలు రోడ్డు వరకు తక్షణమే నిధులు మంజూరు చేసి మొరం పోయాలి

ఈరోడ్డు విషయం పైన అధికారుల నిర్లక్ష్యం విడాలి….
రోడ్డు పరిస్థితి పైన సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేసిన ప్రజలు…
సిపిఎం ఏజెన్సీ నేత గుండెబోయిన రవి గౌడ్..
ఈరోడ్డు విషయం పైన మంత్రి సీతక్క కి ప్రత్యేక విజ్ఞప్తి చేసిన రవిగౌడ్
ములుగు,మార్చి10(జనం సాక్షి):-
ములుగు మండలంలోని పెగడపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బగూడం క్రాస్ నుండి పంట పొలాలకు జాలు వరకు రెండు కిలోమీటర్ల రోడ్డు ఉంది.ఈ రోడ్డు సర్వాపురం,పెగడపల్లి, రాయిని గూడెం గ్రామపంచాయతీల (ప్రజలు) రైతులకు వంద ఎకరాలకు పైన పంట పొలాలు ఉన్నాయి.నిరంతరం ఈ రోడ్డు నుండి వందమందికి పైగ వరిపంట పొలాలకు పోతుంటారు.కనీసం పిండి బస్తాలు కూడ పట్టుకొని పోవడానికి వీలు లేకుండా ఈ రోడ్డు ఇబ్బందిగా ఉందని అలాగే ఉపాధి హామీ పనులు కూడ ఈ ఏరియాలోనే ఎక్కువ గా జరుగుతున్నాయాని రోడ్డు మొత్తం కంకర తేలి కనీసం నడవలేని స్థితిలో ఉంది. టూ వీలర్ కూడ పోలేని పరిస్థితి ఉంది.ఈ విషయమై అనేక సార్లు పెగడపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం తీర్మానం చేసి ఐటిడిఏ పిఓ కు జిల్లా కలెక్టర్ లకు అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చిన కూడా నేటికీ నిధులు మంజూరు కాలేదని సిపిఎం ఏజెన్సీ నాయకులు గుండెబోయిన రవిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి ఈ రోడ్డుకు రైతుల ఉపయోగం కోసం దుబ్బగూడెం క్రాస్ నుండి జాలు వరకు రెండు కిలోమీటర్లు మొరం పోసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో చెరుకుల సాంబయ్య ఈసం ముత్తారావు బద్దుల సాగర్ తోట కమలాకర్,లక్ష్మి నర్సు,బద్దుల రవి, కొమ్మాలు,సదయ్య,రజిత, తోట లక్ష్మి తో పాటు 20 మంది పాల్గొన్నారు.



