పిల్లాయిపల్లిలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
భూదాన్ పోచంపల్లి, మార్చి 30 (జనం సాక్షి): మండలంలోని పిల్లాయిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును సర్పంచ్ పెరుమండ్ల మహాలక్ష్మి దానయ్య, డీసీసీ ఉపాధ్యక్షులు కళ్లెం రాఘవరెడ్డి ఆదివారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు లబ్ధిదారునికి శుభాకాంక్షలు తెలియజేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ పథకాలు పేదలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ ఉపాధ్యక్షులు సామ మధుసూదన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు గోడిసె నాగభూషణం గౌడ్, ఉపాధ్యక్షులు లింగాల మల్లేష్, కాగు ఆంజనేయులు, కళ్లెం పృథ్వి రెడ్డి, పన్నీరు అంజయ్య, మెట్టు రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


