టీఎన్జీవో జడ్చర్ల యూనిట్ అధ్యక్షుడిగా కే. తిరుపతయ్య

జడ్చర్ల, మార్చి 31 (జనంసాక్షి): తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ జడ్చర్ల యూనిట్ నూతన అధ్యక్షుడిగా జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కె. తిరుపతయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2026 – 2029 కాల పరిమితికి సంబంధించి సోమవారం నిర్వహించిన ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల అధికారి, టీఎన్జీవోస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్, ఎన్. యుగంధర్ నాయుడు ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా కే. తిరుపతయ్య, కార్యదర్శిగా ఏ. సాయన్న ఎంపీడీవో కార్యాలయం, మిడ్జిల్, ఉపాధ్యక్షుడిగా టి.డి. ప్రశాంత్ కుమార్ ఎస్టీవో కార్యాలయం, జడ్చర్ల, జాయింట్ సెక్రటరీగా జి. కరుణ, కోశాధికారిగా కె. శారద, ఆర్గనైజింగ్ సెక్రటరీగా జె. శంకర్, పబ్లిసిటీ సెక్రటరీగా సాయిరాం బాధ్యతలు చేపట్టారు. ఈసీ సభ్యులుగా సాయిరాం, కె. విజయలక్ష్మి నియమితులయ్యారు. ఈ ఎన్నికల ఉత్తర్వుల ప్రతులను జిల్లా కలెక్టర్, టీఎన్జీవోస్ జిల్లా కమిటీకి అందజేస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. నోటిఫై చేసిన అన్ని పదవులకు కేవలం ఒక్కొక్క సెట్ నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో, పరిశీలన అనంతరం సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు రాజీవ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.