6వ వార్డులో కర్నాటి వరలక్ష్మి ఎన్నికల ప్రచారం

 

 

 

 

 

 

 

 

 

భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 5 (జనం సాక్షి): భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ 6వ వార్డులో బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి కర్నాటి వరలక్ష్మి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాంనగర్ కాలనీలో ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తూ తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు కర్నాటి అంజమ్మ, వేముల సుమన్ గౌడ్, కర్నాటి విగ్నేశ్వర్, కర్నాటి పాండు, గోలి యాదమ్మ, కళ్యాణి, గంజి వెంకటేశ్, రూప, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.