కేసీఆర్ క్రికెట్ కప్ టార్నమేట్ ప్రారంభం

 

 

 

హాజరైన నాస్కప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు..

బి ఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య..

గంభీరావుపేట ఏప్రిల్ 10(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని కేజీ టు పీజీ ఆవరణలో కెసిఆర్ క్రికెట్ కప్ ప్రారంభోత్సవం శుక్రవారం రోజు నాస్కప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య చేతుల మీదుగా ప్రారంభించారు, వారు మాట్లాడుతూ, మండలంలోని ఒక్కో ఎంపిటిసి ఒక్కో టీముగా, 13 ఎంపీటీసీలకు గాను 13 టీములు పాల్గొంటారని,యువకులు శారీరకంగా మానసికంగా ఉల్లాసం కలిగించేందుకు, క్రీడలు ఎంతో ప్రాముఖ్యత అని తెలిపారు, ఈ కార్యక్రమంలో, మండల శాఖ అధ్యక్షులు, వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు, సర్పంచులు, ఉపసర్పంచ్, మాజీ ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు యువకులు, పాల్గొన్నారు

తాజావార్తలు