108 కళశములతో శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి క్షిరాభిషేకం

 

 

 

 

 

 

భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 26 (జనం సాక్షి): మండలంలోని కనుముక్కల గ్రామంలో శ్రీశ్రీశ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 23వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ధర్మకర్తలు కోట మల్లారెడ్డి, పుష్పలత ఆధ్వర్యంలో వేదపండితులు చీకలమఱ్ఱి వంశీకృష్ణమాచార్యులు మంత్రోచ్చారణల మధ్య 108 కళశములతో క్షిరాభిషేకం నిర్వహించారు. అనంతరం నిత్య హోమం, శ్రీ సుదర్శన హవనం, హోమ బలిహరణం, తీర్థ ప్రసాద గోష్టి శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ పాండురంగ స్వామి భజన మండలి, పోచంపల్లి వారి భజనలతో ఆలయ ప్రాంగణం భక్తిరసంతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు గట్టు పాండురంగారెడ్డి, ఉపాధ్యక్షులు కోట అజిత్ రెడ్డి, గౌరవ సలహాదారు భోగ చంద్రశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ నూకల లింగస్వామి యాదవ్, సభ్యులు రంగ మధు గుప్తా, కోట భూపాల్ రెడ్డి, కోట సత్తిరెడ్డి, కట్కూరి శ్రీనివాస్ గౌడ్, వేణుగోపాల చారి, కోట మధుమోహన్ రెడ్డి, కోట రంగారెడ్డి, మంచాల నవీన్, మేకల తిరుమలేష్ యాదవ్, సిరిపంగి రాములు, పట్నం పారిజాత, కర్నాటి భార్గవి, దారెడ్డి ఐశ్వర్య, చుక్క మంజుల, ఆవుల మాధవి,తదితరులు పాల్గొన్నారు.