జగిత్యాలకు బయల్దేరిన కేటీఆర్
ఏప్రిల్ 09: (జనం సాక్షి )బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు బయల్దేరారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలవనున్నారు. ఈ సందర్భంగా జగిత్యాల శివారులో బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్‌కు స్వాగతం పలకున్నాయి. అక్కడి నుంచి బైక్ ర్యాలీతో జీవన్ రెడ్డి నివాసానికి రానున్నారు. కేటీఆర్ రాకతో జీవన్ రెడ్డి నివాసంతో పాటు జగిత్యాల పట్టణం గులాబీమయంగా మారింది.కాగా, కేటీఆర్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు సైతం జీవన్‌రెడ్డి ఇంటికి రానున్నారు. రాష్ట్ర రాజకీయాలపై చర్చించిన అనంతరం ఆయనను పార్టీలోకి లాంఛనంగా కేటీఆర్ ఆహ్వానించనునున్నారు.1984లో కాంగ్రెస్ పార్టీలో చేరిన జీవన్‌రెడ్డి నలభై మూడేండ్లుగా ఉత్తర తెలంగాణలోనే కీలకమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్‌రెడ్డి మూడు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2014లో తెలంగాణ అవతరించిన తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.తెలంగాణ పర్యాటకం2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన జీవన్‌రెడ్డి 2019లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచి శాసన మండలిలో ఏకైక కాంగ్రెస్ సభ్యుడిగా కొనసాగారు. జగిత్యాల నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సంజయ్‌కుమార్‌ను సీఎం రేవంత్‌రెడ్డి పార్టీలో చేర్చుకోవడంతో జీవన్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. జీవన్‌రెడ్డి వర్గానికి ప్రాధాన్యత తగ్గిపోవడం, నామినేటెడ్ పదవుల కోసం ప్రతిపాదించిన వారికి పదవులను ఇవ్వకుండా ఎమ్మెల్యే సూచించిన వ్యక్తులకు ఇవ్వడం, ప్రధాన అనుచరుల్లో ఒకరు దారుణహత్యకు గురికావడంతో జీవన్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల, రాయికల్ పట్టణాల్లో జీవన్‌రెడ్డి వర్గానికి చెందిన వారిని కాంగ్రెస్ పక్కన పెట్టడంతో తీవ్ర ఆవేదనకు లోనైన జీవన్‌రెడ్డి గత నెల 25న కార్యకర్తలు, నాయకుల సమక్షంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.


