ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు…

శంకర్ పల్లి, ఏప్రిల్ 11(జనం సాక్షి)

మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా శనివారం మున్సిపల్ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… జ్యోతిరావు పూలే భారతీయ సామాజిక కార్యకర్త,రచయిత, తత్వవేత్త మరియు భారతదేశంలో కుల వ్యవస్థ వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని,వెనకబడిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్య సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ,ఆయన ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ ఆనంద్ రావు ఎర్ర,చాకలి అశోక్,బండ్ల గూడెం ప్రశాంత్, వాకిటోళ్ళ గణేష్, సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి,పార్సి బాలకృష్ణ,జూలకంటి పాండు రంగారెడ్డి,ప్రకాష్ గుప్తా,చంద్రమౌళి,గుండా శేఖర్,మేనేజర్ అంజన్ కుమార్,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.