మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి…
చెన్నారావుపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం….
చెన్నారావుపేట, ఏప్రిల్ 10 ( జనం సాక్షి): గ్రామాలలోని రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. శక్రవారం చెన్నారావుపేట గ్రామ శివారులో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో చెన్నారావుపేట సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.రైతులకు కనీస మద్దతు ధర క్వింటాల్ కు రూ. 2400 అందిస్తున్నామని రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో కూడా ఉచిత విద్యుత్ తో రైతులకు ఎంతో మేలు జరిగిందని ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశకు తీసుకెళ్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంది శ్వేత కృష్ణ చైతన్య రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి నీరజ, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, అసిస్టెంట్ రిజిస్టర్, నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, తహసిల్దార్ మహమ్మద్ ఆబిద్ అలీ, ఎంపీడీవో ఆయేషా పర్వీన్, మండల వ్యవసాయ అధికారి గోపాల్ రెడ్డి, గిర్దావర్ మహమ్మద్ రషీద్, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ కోరె కుమారస్వామి, చెన్నారావుపేట సొసైటీ సీఈఓ చిట్టె రవి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్దన రమేష్, మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు భూక్య గోపాల్ నాయక్, గ్రామ ఉపసర్పంచ్ దొంతి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి ఆవుల రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పెట రమేష్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండి హరీష్, బొంత శ్రీనివాస్, మాజీ సర్పంచ్ హంస విజయరామ రాజు, జున్నుతుల మహేందర్ రెడ్డి, వనపర్తి శోభన్, సొసైటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


