బావిలో ఈతకు వెళ్లి గల్లంతై వ్యక్తి మృతి

బచ్చన్నపేట మే 3 ( జనం సాక్షి):జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో లో బావిలో ఈతకు వెళ్లిన యువకుడు శనివారం గల్లంతై ఆదివారం ఉదయం శవమైన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల కేంద్రానికి చెందిన ఏనుగుల బిక్షపతి పద్మ దంపతుల చిన్న కుమారుడైన ప్రశాంత్ ట్రాక్టర్ డ్రైవర్ (27) సిద్దిపేట వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న రాజన్న బావిలో శనివారం ఈతకు వెళ్లాడు, ఈతకొడుతున్న క్రమంలో పైనుంచి దూకాడు, దూకిన కొద్దిసేపటి వరకు ప్రశాంత్ కనిపించకపోవడంతో స్థానికులు పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది గజ ఈతగాళ్లను తీసుకొచ్చి బావిలో నాలుగు గంటలపాటు గాలించినా ప్రశాంత్ ఆచూకీ దొరకలేదు, అయితే ఆదివారం తెల్లవారుజామున స్థానికులు మరోసారి బావిలో వెతకడంతో ప్రశాంత్ మృతుదేహం లభ్యమైంది, ప్రశాంత్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు స్థానిక ఎస్ఐ ఏ శ్రీకాంత్ తెలిపారు

తాజావార్తలు