అంగన్వాడి కేంద్రంలో సామూహిక అన్నప్రాసన

 

 

 

 

 

 

తలకొండపల్లి ఫిబ్రవరి 25(జనంసాక్షి):తలకొండపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ లో బుధవారం 6 నెలలు నిండిన పిల్లలకు గ్రామ సర్పంచ్ భారతమ్మ గోపాల్,ఉప సర్పంచ్ తడిసిన జ్యోతి ప్రదీప్ రెడ్డి,లు సామూహిక అన్న ప్రాసన చేశారు.ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ నిర్మల మాట్లాడుతూ 6 నెలలు వయసులోపు చిన్నారులకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని,6 నెలల వయసు దాటిన వారికి అదనపు ఆహారం అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాలామృతం ప్రతిరోజు ఇవ్వాలని సూచించారు.గర్భిణీలు,బాలింతలు,5 సంవత్సరాలు లోపు చిన్నారులు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు.అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ..అంగన్వాడి కేంద్రంలో బాలింత తల్లులకు,పిల్లలకు అందించే ఆరోగ్యకరమైన భోజనాన్ని,ఇతర కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి మహేందర్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు జంగయ్య,వార్డు సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి,ఆశ వర్కర్ మాధవి,అంగన్వాడి కార్యకర్త వరలక్ష్మి,ఆంజనేయులు,గర్భిణి తల్లులు,బాలింతలు,చిన్నారి విద్యార్థులు,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.