ఘనంగా మే డే ఉత్సవాలు
గుండాల మే 2 ( జనం సాక్షి )గుండాల మండల వ్యాప్తంగా ప్రపంచ కార్మికుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈసందర్భంగా మండల పరిధిలోని వస్తాకొండూర్ గ్రామంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మిక కర్షకులతోపాటు ఏఐటీయూసీ సిఐటియు హమాలి కార్మిక సంఘం అధ్యక్షులు చెట్టిపల్లి రాములు భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు సురారపు ముత్తయ్య ఆధ్వర్యంలో సిపిఐ సిపిఎం నాయకులతో కలిసి జెండా ఆవిష్కరించరు ఈసందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు సూరారపు ముత్తయ్య మాట్లాడుతూ మేడే జిందాబాద్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ చారిత్రక పోరాటం (చికాగో ఘటన): 1886 మే 1న అమెరికాలోని చికాగోలో కార్మికులు 8 గంటల పని దినం కోసం చేసిన ఉద్యమం వారిపై జరిగిన కాల్పులు మేడేకు పునాది వేశాయని 12 గంటల పనిని ఎనిమిది గంటలకు సవరించిన రోజు సమాజ నిర్మాణంలో, ఆర్థికాభివృద్ధిలో కార్మికుల పాత్రను గుర్తిస్తూ వారి శ్రమను గౌరవించే రోజని కార్మికుల హక్కుల దినంగా మేడే ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగాల అనిల్ కుమార్ గౌడ్ ఉపసర్పంచ్ చెట్టిపల్లి పరశురాములు గౌడ కార్మిక సంఘం నాయకులు పిట్టల పూర్ణచందర్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు చెట్టిపల్లి యాదగిరి ప్రధాన కార్యదర్శి ఎస్.కె మదర్ సిపిఎం మండల కమిటీ సభ్యులు పోతరబోయిన సత్యనారాయణ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు మైబెల్లి బూడిద భాష చెట్టిపల్లి శ్రీను చెట్టిపల్లి రామచందర్ సురారపు సుధాకర్ యాకుబ్ గ్రామపంచాయతీ కార్మిక సంఘం నాయకులు బట్ట యాదగిరి వంగాల బాలయ్య తదితరులు పాల్గొన్నారు



