ఎమ్మెల్యే ను కలిసిన అల్లిపూర్ పాలకవర్గ సభ్యులు
జనం సాక్షి రాయికల్ :జగిత్యాల్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసిన అల్లిపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు అల్లిపూర్ గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మరియు గ్రామంలో ఇటీవల ప్రారంభం అయిన వారసంత కోసం ప్రజల కోరిక మేరకు హై మాస్ లైట్ ను మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధుల మంజూరుకు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎంబారి గౌతమీ వెంకటేష్, ఉప సర్పంచ్ గురులింగు వినయ్ కుమార్, వార్డు సభ్యులు జాగిరి ప్రశాంత్, కల్లెడ గంగాధర్, ఎంబారి సాయి కుమార్, అత్తినేని వనిత, మందుల రాధ, ఉరుమడ్ల సంధ్య -శ్రీనివాస్, ఉరుమడ్ల దీపిక -సంజీవ్, అట్కాపురం భవాని -గంగశేఖర్ లు పాల్గొన్నారు.


