1.85 కోట్ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరుచేయించిన మంత్రి శ్రీధర్ బాబు

నేడు లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా పంపిణీ –
– అంగన్వాడి టీచర్లకు సెల్ ఫోన్స్, ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ
మంథని, ( జనంసాక్షి ) : పెద్దపల్లి జిల్లాలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్, పాలకుర్తి ఇతర మండలాలకు సంబంధించిన 169 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో పాటు 129 కల్యాణలక్ష్మి చెక్కులు.. 1 కోటి 84 లక్షల 2 వేల 464 రూపాయలు విలువచేసే చెక్కులను మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంజూరు చేయించారు. ఈ చెక్కులను మంగళవారం సాయంత్రం 5 గంటలకు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చేతుల మీదుగా మంథని శివ కిరణ్ గార్డెన్ లో లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అలాగే 164 మంది అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు, గ్యాస్ స్టవ్ లో అందజేయనున్నారు. 350 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు.


