ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు సృజనాత్మకత నైతిక విలువలతో కూడిన విద్య మిట్ట కోడూర్ గ్రామ సర్పంచ్

 

 

 

 

పూడూర్ ఏప్రిల్ 08(జనం సాక్షి): పరిగి డివిజన్ పరిధిలోని మిట్ట కోడూరు గ్రామంలో విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకత కళలను వెలికి తీయడానికి ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్నారని మిట్ట కోడూరు గ్రామ సర్పంచ్ పి మాణిక్యం గ్రామ సర్పంచ్ తెలియజేశారు బుధవారం నాడు పరిగి మండలంలోని ప్రాథమిక పాఠశాల మిట్ట కోడూరు ప్రధానోపాధ్యాయులు ఎండి ఉస్మాన్ అలీ అధ్యక్షతన ఐదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ పి మాణిక్యం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మిట్ట కోడూర్ పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల విద్యా ప్రగతికి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నిరంత కృషి చేస్తున్నారని తెలియజేశారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ అనిత రాణి మాట్లాడుతు గ్రామంలోని ఐదు నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలందరినీ ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించడానికి మహిళా సంఘాల సభ్యులతో చర్చించి తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు పాఠశాలలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు జానపద నృత్యాలు ప్రదర్శించారు ఇట్టి కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బుద్ధదేవ్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు జనార్దన్ మరియు అనంత గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు ఏ కృష్ణయ్య ఎం నర్సింలు రాజు కవిత మేడం మరియు గ్రామ సర్పంచ్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

తాజావార్తలు