తెలంగాణ గాయకుడు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ,మాజీ ఎమ్మెల్యే

యాదాద్రి జిల్లా తుర్కపల్లి, ఏప్రిల్ 8 (జనం సాక్షితుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ తెలంగాణ ఉద్యమ నాయకుడు ఎండి జహంగీర్ ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులను శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్, మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి లు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జహంగీర్ తన గొంతుకతో ప్రజలను చైతన్య పరచాలని, ఆయన పాటలు ఉద్యమానికి ఊపిరి పోసాయని కొనియాడారు. ప్రజా గాయకుడిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్ ప్రముఖ జర్నలిస్టు విరాహత్ అలీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి, మండల సెక్రెటరీ జనరల్ సాగర్ల పరమేష్ యాదవ్ మాజీ ఎంపీటీసీలు పలుగుల నవీన్ కుమార్, గిద్దె కరుణాకర్ ,నాయకులు, భూక్య రవి నాయక్, గుంటి శ్రీశైలం, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజావార్తలు