వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి: అదనపు డీజీపీ

 

 

 

 

అంబర్పేట్ ఫిబ్రవరి 28 ( జనం సాక్షి ):ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వీర కోనే ఆధ్వర్యంలో అనంత కళాశాలలో విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ పేరుతో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో రహదారి భద్రతపై చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ అదనపు డీజీపీ రాములు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వాహనదారులు తమ భద్రత కోసం ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా యువత ఓవర్ స్పీడ్, ఓవర్ టేక్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర అలవాట్లను పూర్తిగా మానుకోవాలని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని తెలిపారు.విద్యార్థులు రహదారులపై బాధ్యతాయుతంగా వ్యవహరించి, హెల్మెట్ మరియు సీటు బెల్ట్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా మాత్రమే ప్రమాదాలను తగ్గించవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపల్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు