గుంజపడుగు సోలార్ పవర్ ప్లాంట్ ను పరిశీలించిన నాబార్డ్ అధికారులు
మంథని, ( జనంసాక్షి ) : పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామ శివారులో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.3.40 కోట్ల వ్యయంతో పిఎం కుసుమ్ పథకం ద్వారా ఏర్పాటు చేసిన 1 మెగా వాట్ సోలార్ పవర్ ప్లాంట్ ను ముంబై నుంచి వచ్చిన నాబార్డ్ అధికారులు పరిశీలించారు. సోలార్ ప్లాంట్ లో త్వరలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా శరవేగంగా పనులు చేపడుతున్నట్లు సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్ అధికారులకు వివరించారు. ఈ పవర్ ప్లాంట్ లో రోజుకు 5000 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం జయప్రకాష్, పలువురు నాబార్డ్ అధికారులు, సంఘ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



