నేత్ర పర్వంగా రథోత్సవం.. రథోత్సవం పై కొలువుదీరినసీతారాముడు

_భక్తులతో నిండిపోయిన గంభీరావుపేట..
_స్వామి వారిని దర్శించుకున్న పలువురు సర్పంచులు..
రాజకీయ నాయకులు..
గంభీరావుపేట ఏప్రిల్ 04 (జనం సాక్షి):రాజన్న సిరిసిల్ల జిల్లా మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతు న్నాయి. శనివారం రోజు స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి రథోత్సవం కన్నుల పండగ సితార బజార్ వీధుల గుండా నిర్వహించారు.భాజా భజంత్రీ లు మంగళ వాయిద్యాలు భక్తుల, రామనామ స్మరణతతో స్వామి వారిని ఊరేగింపులు జరుగుతున్నాయి, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పలువురు సర్పంచులతో పాటు, తెలంగాణ జాగృతి నాయకుడు కూర సురేష్, తోపాటు రాధాకృష్ణ శర్మ,తో వివిధ పార్టీల మండల అధ్యక్షులు, దర్శించుకుని స్వామివారి ఆశీర్వాదం పొందారు అనంతరం మహిళలు మంగళ హారతులతో పెద్ద ఎత్తున స్వామివారికి స్వాగతం పలికారు, ఆలయ చైర్మన్ మల్లు వారి నర్సా గౌడ్ మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవంనికి చుట్టుపక్కల నుండి కాకుండా వివిధ జిల్లాల నుండి హాజరయ్యే భక్తజనానికి అన్ని విధాల ఏర్పాటు చేశామని, ప్రజలందరూ స్వామివారిని దర్శించుకుని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు,అంతేకాకుండా రథోత్సవానికి త్రాగునీరు, అందజేస్తున్న వారందరికీ స్వామి వారి ఆశీస్సులు ఉంటాయని తెలిపారు, ఈ బ్రహ్మోత్సవాలకు సహకరించిన ఆలయ కమిటీ, ప్రజలకు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు, ఆ శ్రీరాముని ఆశీస్సులు ప్రతి భక్తులకు ఉంటాయని తెలిపారు,


