గోదావరి పుష్కర ఘాట్లను పరిశీలించిన అధికారులు.

ఏటూరునాగారం,ఫిబ్రవరి 18(జనంసాక్షి).వచ్చేయడాది పుష్కరాలు సందర్భంగా రామన్నగూడెం ముల్లకట్ట ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేసి పుణ్యం స్నానాలు ఆచరించే విధంగా తగిన ఏర్పాటు చేసేటందుకు పరిశీలించినట్లు ఆర్డీఓ వెంకటేష్ తెలిపారు. గోదావరి పుష్కరాలు. జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజులపాటు జరగనున్నాయి. గోదావరి వరద నీరు మరింత లోతుగా ఉంటే వాటిని ఇసుక బస్తాలతో పూడ్చివేయాలన్నారు. మెట్లు మరింత వెడల్పు చేసి భక్తులకు సౌకర్యంగా ఉండేవిధంగా చూడాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. గోదావరిలో వరద నీరు ఎక్కడ ఎక్కువుంటుందో అక్కడ ఘాట్లను ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. పుణ్య స్నానాలకు వచ్చే భక్తులు ఆర్టీసీ మరియు ప్రైవేటు వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లపై స్థానిక ప్రజలతో చర్చించారు, దానికి సీఐ శ్రీనివాస్ పార్కింగ్ విషయంలో పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ లు గద్దల నవీన్, ముల్లకట్ట సర్పంచ్ ఈసం జనార్ధన్, పలువురు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


