లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

 

 

 

 

 

 

 

 

రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం..

ఇంటి స్థలం పేరు మార్పిడి కోసం లంచం డిమాండ్

అనిశా అధికారులను ఆశ్రయించిన ‌స్థలం యజమాని

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని రంగారెడ్డి జిల్లా ఏసీబీ కోర్టుకు తరలింపు

తలకొండపల్లి మే 06(జనంసాక్షి):రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని వెల్జాల్ పంచాయతీ కార్యదర్శి ఎం.శరత్ ఏసీబీ వలకు చిక్కారు.స్థలం పేరు మార్పిడి కోసం ఓ వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు.అనిశా అధికారుల కథనం ప్రకారం..ఓ వ్యక్తి తనకు ఉన్న స్థలాన్ని గ్రామంలో ఉన్న మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయగా,అట్టి స్థలాన్ని పంచాయితీ రికార్డులో పేరు మార్పిడి చేయాలని పంచాయతీ కార్యదర్శిని కోరగా,అతను రూ,30 వేలు లంచం డిమాండ్ చేశాడు.కాగా రూ,20 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.లంచం ఇవ్వడం ఇష్టం లేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.వారి సూచనల మేరకు బాధితుడు రూ,20 వేలను మంగళవారం వెల్జాల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయితీ కార్యదర్శి ఎం.శరత్ కు ఇస్తుండగా రంగారెడ్డి జిల్లా రేంజ్ ఏసీబీ డిఎస్పి ఆనంద్ కుమార్ పట్టుకున్నారు.వెంటనే కార్యదర్శి శరత్,ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించి,పంచాయతీ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.ఆయనను రంగారెడ్డి జిల్లా ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.ప్రభుత్వ అధికారులు ఎవ్వరు లంచం అడిగిన అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాలని ఏసీబీ డిఎస్పి ఆనంద్ కుమార్ సూచించారు.