ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

 

 

 

 

 

 

తుర్కపల్లి ,ఏప్రిల్ 8 (జనం సాక్షి)ప్రభుత్వం నిర్వహించే ఆరోగ్య కార్యక్రమాలను అన్నిటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సోముల వెంకటేశం అన్నారు. బుధవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సబ్ సెంటర్ లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మండల వైద్యాధికారి డాక్టర్ రుచిరా రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్ సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో మాతా సురక్ష కార్యక్రమాన్ని సర్పంచ్ ప్రారంభించారు. సందర్భంగా తల్లులందరినీ పరీక్షించి తగిన మందులు ,ఆరోగ్య సమస్యలు, జాగ్రత్తల గురించి అవగాహన కల్పించి ఐరన్, క్యాల్షియం మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సుహాసిని, ఎంపీహెచ్ఏ ఎం జానీ పాషా, ఆశావర్కర్ వరమ్మ, మహిళలు పాల్గొన్నారు.

తాజావార్తలు