యువతను మత్తులోకి నెడుతున్న రాజకీయ నేతలు

 

 

 

 

పి.వై.ఎల్ జిల్లా మహాసభలో కోలా లక్ష్మీ నారాయణ

భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 22 (జనం సాక్షి): దేశంలో, రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాలు, మద్యం అమ్మకాలు పెరిగినా వాటిని అరికట్టకుండా యువతను మత్తులో ముంచి రాజకీయ నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్నారని పి.వై.ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా లక్ష్మీ నారాయణ విమర్శించారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని రమాదేవి ఫంక్షన్ హాల్‌లో జరిగిన పి.వై.ఎల్ యాదాద్రి-భువనగిరి జిల్లా 9వ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ యువతను చైతన్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన పాలకులు వారిని వ్యసనాల బారిన పడేస్తున్నారని, నిరుద్యోగం పెరుగుతున్నా ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమవుతున్నారని అన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు మామిడాల భిక్షపతి, ఇఫ్టూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. జనార్దన్, పి.వై.ఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బేజాడి కుమార్, కోశాధికారి డి. రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి సాదుల శ్రీకాంత్, కోశాధికారి పగడాల శివ, పి.డి.ఎస్.యూ జిల్లా కార్యదర్శి ఆర్. ఉదయ్, ఇఫ్టూ జిల్లా అధ్యక్షులు జి. నాగరాజు, గోరుగంటి ముత్యాలు, బాలకృష్ణ, పోతగాళ్ల నర్సింహ, సర్వన్, వెంకటేష్, మల్లేష్, సుధాకర్, ఆకుల కృష్ణ, శికిలం వెంకటేష్, మామిడాల భాను, గోరుగంటి నవీన్, శ్రీనాథ్, శివ, పాక నవీన్ తదితరులు పాల్గొన్నారు.