Pragya Jaiswal : ‘అఖండ’ బ్యూటీకి అవకాశాలు ఎందుకు తగ్గాయి!?

share on facebook

నందమూరి బాలయ్య ‘అఖండ’తో అందరి హృదయాల్ని కొల్లగొట్టిన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఈ అందాల సుందరి కుర్రాళ్ల మతులు పోగొట్టడమేకాదు.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎంతో హుషారుగా కనిపిస్తూ.. పోస్టులు పెడుతూ నెటిజనుల ప్రశ్నలకు, అభిమానుల చిలిపి పోస్టులకు అంతే చిలిపిగా సమాధానాలిస్తూ తనకంటూ ఓ క్రేజ్ ని ఏర్పరచుకుంటోంది! తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో
రెడ్ బ్లౌజ్‌లో పరువాలు చూపిస్తూ ప్రగ్యాజైస్వాల్ పెట్టిన హాట్ పిక్స్ యువతరానికి కేక పుట్టిస్తున్నాయి. దీంతో ఈ రెడ్ కలర్ డ్రెస్‌లో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. తాను ధరించిన గాగ్రా, చోళీలో కుర్రాళ్ల హృదయాల్లో గిలిగింతలు పెడుతోంది! ఆఫర్ల కోసం పరువాల్ని వలగా విసురుతోంది ఈ ‘అఖండ’ బ్యూటీ!!
‘కంచె’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ప్రగ్యా జైస్వాల్ తన నటనతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఆ సినిమా తర్వాత కొన్ని చిత్రాల్లో కనిపించినప్పటికీ.. ఆ చిత్రాలేవీ ఆమె కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడలేకపోయాయి. ‘కంచె’ సినిమా తర్వాత సినిమాలు ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. తన అందాలను చిందించినా కూడా అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ఎందుకో గానీ .. ప్రగ్యా జైస్వాల్ తాను అనుకున్న గోల్ ని మాత్రం చేరుకోలేక పోతోంది.
ఈ నేపథ్యంలో ఈ బ్యూటీ గత ఏడాది నందమూరి బాలకృష్ణకు జోడీగా నటించిన ‘అఖండ’ తో ఓ వెలుగు వెలిగింది. నందమూరి నట సింహం ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన యాక్షన్ ఫిల్మ్ ‘అఖండ’ ఆమెను ఎక్కడికో తీసుకెళ్లింది. బోయపాటి-బాలయ్య కాంబినేషన్‌లో గతంలో వచ్చిన రెండు చిత్రాలు మంచి విజయాల్ని నమోదు చేశాయి. ఈ మూడవ చిత్రం’అఖండ’ భారీ అంచనాలతో విడుదలై మంచి విజయం సాధించి బాక్సాఫీస్ ని కాసులవర్షంతో నింపేసింది. అంతే కాదు.. ఈ సినిమా అన్ని అంచనాలను అందుకుని బాలయ్యకు మంచి విజయాన్ని అందించింది. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన ప్రగ్యాకు కూడా మంచి విజయం దక్కింది. ఆమెకు కెరీర్ పరంగా కూడా కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సక్సెస్ ని ఈ భామ ఇప్పటికీ తెగ ఎంజాయ్ చేస్తోందిట. 2022 డిసెంబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టిన ఈ ‘అఖండ’ చిత్రసీమకూ ఊపిరి పోసింది. కరోనా పుణ్యమాని థియేటర్లన్నీ ప్రేక్షకులు లేక వెలవెలబోతోన్న తరుణంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీలో రికార్డుల పరంగా పెద్ద దుమారమే లేపింది. దాంతో మూలన పడ్డ ఎన్నో సినిమాలు దుమ్ము దులుపుకొని థియేటర్ల బాట పట్టాయి.
అయితే.. టాలీవుడ్ లో నటిగా ఎంతో వెలిగిపోవాలని వచ్చిన ‘అఖండ’ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కు, ఆమె కెరీర్ కు ఈ సినిమా ఎంతగానో మార్గాన్ని సుగమం చేసింది. ఈ ‘అఖండ’లో IAS ఆఫీసర్‌గా నటించింది. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఫిగర్స్ టచ్ చేసింది. ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుంది. అక్కడ కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది . 1991 జనవరి 12న జన్మించిన ఈ ముద్దుగుమ్మ తొలుత కొన్ని యాడ్ ఫిల్మ్స్‌లో నటించింది.
2014లో తెలుగు, తమిళ్ బై లింగ్వల్ ‘విరాట్టు డేగ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో 2015లో క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కంచె’ సినిమాతో పరిచయమైంది. తొలి సినిమాతోనే బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డు కైవసం చేసుకుంది. ఇంతటితో ఆగకుండా బాలీవుడ్ లో ‘టిటూ MBA’ సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇక ఈమె తెలుగులో ‘కంచె’ తర్వాత చేసిన ‘నక్షత్రం’ (2017), మంచు విష్ణుతో చేసిన ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాలు ఈమెకు సక్సెస్ ని ఇవ్వలేకపోయాయి. పూణెలోని సింబిసిస్ లా స్కూల్‌లో చదువుకున్న ప్రగ్యా జైస్వాల్ కాలేజీలో అందాల పోటీల్లో పాల్గొని అక్కడ కూడా సత్తా చాటింది. ఇక ‘అఖండ’ సక్సెస్ అయినా.. ఆ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్లింది. ప్రగ్యాకు పెద్ద ఒరిగిందేమి లేదు. ఈ సినిమా సక్సెస్ అయినా.. అవకాశాల కోసం ఈమె ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది! హిందీలో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ సినిమాలో నటించిన ప్రగ్యా జైస్వాల్ అటు నాగార్జున, కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేసిన ‘ఓం నమో వేంటటేశాయ’ సినిమాల్లో నటించింది. ఈ యేడాది మోహన్ బాబు హీరోగా నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాలో NIA ఆఫీసర్ పాత్రలో కనిపించింది. ఈ యేడాది ‘మై చలా’ అనే మ్యూజిక్ ఆల్బమ్స్‌లో మెరిసింది. ఈమె కెరీర్‌లో ఎన్ని సినిమాల్లో నటించినా.. ‘కంచె’ మంచి సినిమాగా గుర్తింపు ఇస్తే.. ‘అఖండ’ కమర్షియల్ సక్సెస్ అందించింది. ఇలా హిట్ సినిమాలో నటించినా.. ఈమె ఫేట్ మాత్రం మారలేదనే చెప్పాలి. ఓ వైపు సినిమాలతో పాటు ఇలా పెయిడ్ యాడ్స్‌తో రెండు చేతులా సంపాదిస్తోంది ప్రగ్యాజైస్వాల్. వెంట వెంటనే హిట్ సినిమా దర్శకులు, స్టార్ హీరోల పక్కన యాక్ట్ చేసే అవకాశాలు రాకపోవడంతో ఈమెకు తగినంత స్టార్ ఇమేజ్‌ దక్కడం లేదు. పరిస్థితిని గమనించిన తోటి స్నేహితులు కెరీర్ ముందుకు సాగాలంటే ఎన్నో కిటుకులు చెప్పారట! తాజాగా ప్రగ్యా జైస్వాల్ ఫ్రెండ్స్ ఇచ్చిన టిప్స్ నే ఫాలో అవుతోందిట! అందులో భాగంగానే ఆఫర్ల కోసం పరువాల్ని వలగా విసురుతోందిట ఈ ‘అఖండ’ బ్యూటీ!!

Other News

Comments are closed.