దళితుల గురించి మాట్లాడే హక్కు ప్రవీణ్ కుమార్ కు లేదు
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.
పరకాల, ఫిబ్రవరి 5 (జనం సాక్షి):
పరకాల మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా వారం రోజున పట్టణంలోని 12వ వార్డు కోడెల మౌనిష దిలీప్, 21వ వార్డు అభ్యర్థి సూదమల్ల రమేష్ ల గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి తో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందామన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని,ఒక ప్రణాళిక వ్యవస్థతో పరకాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు టిఆర్ఎస్ నాయకులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు లేదని, దళితుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వంలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చినారు అని, దళితులకు మూడెకరాల భూమి,దళిత ముఖ్యమంత్రి, దళితబంధు వంటి మోసపూరిత హామీలతో గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. పరకాల పట్టణం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్ ప్రయాణం, ఇందిరమ్మ చీరల పంపిణీ, తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.


