అల్లిపూర్ లో ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక ప్రారంభం

జనం సాక్షి రాయికల్ :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగాచేపట్టిన ప్రజా పాలన… ప్రగతి ప్రణాళిక కార్యక్రమం శుక్రవారం రోజున అల్లిపూర్ గ్రామంలో
గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఎంబారీ గౌతమి వెంకటేష్ అధ్యక్షతన గ్రామపంచాయతీలో సమావేశం ఏర్పాటు చేసి, శ్రమదానం చేస్తూ ర్యాలీ నిర్వహించారు.అనంతరం పాలకవర్గం మరియు సిబ్బంది తో ర్యాలీగా వెళ్లి హై స్కూల్ పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గౌతమి వెంకటేష్ మాట్లాడుతూ పథకాలు అర్హులకు చేరేలా చూడడం, మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఇన్చార్జి సెక్రెటరీ శ్రీహరి,కారాబర్ రాజేందర్, గ్రామపంచాయతీ పాలకవర్గం వార్డు మెంబర్స్ మందుల రాధ, ఉరుమడ్ల దీపిక , అటకాపురం భవాని, అత్తినేని వనిత,అంగన్వాడి టీచర్స్, ఆశా వర్కర్స్, మహిళా సంఘం సభ్యులు , ఆరోగ్య శాఖ సిబ్బంది,అధికారులు ప్రజలు పాల్గొన్నారు.