మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో వీగిపోయిన రాహుల్ గాంధీ నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మ దగ్థం

 

 

 

 

జనం సాక్షి తరిగొప్పుల న్యూస్ 19తరిగొప్పుల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర మహిళల అభ్యున్నతికి, సాధికారత కోసం 33శాతం మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు ను ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెడితే కాంగ్రెస్ మరియు ఇండియా కూటమి నేతలు అందరూ మహిళా బిల్లును అడ్డుకుని బిల్లు పాస్ కాకుండా చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు తరిగొప్పుల మండల అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్థం చేయడం జరిగింది,ఈసందర్బంగా అధ్యక్షులు మాట్లాడుతూ నిన్నటి రోజున పార్లమెంట్ సాక్షిగా మహిళల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని అన్నారు మహిళలకు కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసింది అని,చట్ట సభల్లో మహిళల ప్రాతినిథ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుని మహిళాలోకానికి తీవ్ర అన్యాయం చేసింది అని ఉన్నారు, ప్రధాని నరేంద్ర మోడీ 33శాతం మహిళా బిల్లు ను అమోదింపజేసి మహిళలకు చట్ట సభల్లో సముషిత స్థానం కల్పించి నారీ శక్తి ని భారత్ అభివ్రృద్ది లో భాగస్వాములు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటే మహిళల నాయకత్వాన్ని ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ మరియు దాని మిత్రపక్షాలు మహిళా బిల్లును అడ్డుకుని తాము మహిళా అభ్యున్నతికి వ్యతిరేకులమని మరో సారి నిరూపించుకున్నారని అన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మహిళ లోకం కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు , ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్ యాదవ్ ప్రధాన కార్యదర్శి పబ్బోజు రాం బ్రహ్మచారి, కొన్నే రాజు, యువమోర్చా మండల అధ్యక్షులు చిలువేరు వెంకటేష్ గౌడ్ , యువ మోర్చా జిల్లా నాయకులు పెద్ద మేన రాజు యాదవ్ ,కిసాన్ మోర్చా జిల్లా నాయకులు జీల సతీష్ యాదవ్, బీసీ మోర్చా మండల అధ్యక్షులు కావటి రాజు , బూత్ అధ్యక్షులు భూక్య శ్రీకాంత్ నాయక్ , గుగులోత్ అనిల్ నాయక్ అంకం నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.