అంబులెన్స్‌లో క్షేమంగా ప్రసవం

ప్రాణాలు నిలిపిన 108 సిబ్బంది..

గంభీరావుపేట మే 01( జనం సాక్షి):

గంభీరావుపేట మండలంలో 108 సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక గర్భిణికి ప్రాణదాతలుగా నిలిచారు. గంభీరావుపేట మండలం గజసింగారం గ్రామానికి చెందిన సంపంగి హరీష అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. బాధిత మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే నొప్పులు తీవ్రమవ్వడంతో పరిస్థితి విషమంగా మారింది. పరిస్థితిని గమనించిన ఈఎంటి, చెలిమెల సాయికృష్ణ, పైలట్ మనోజ్ కుమార్ సమయస్ఫూర్తితో వ్యవహరించి అంబులెన్సు వాహనంలోనే ప్రసవం చేశారు. హరీష పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, అనంతరం వారిని మెరుగైన చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సిబ్బంది తెలిపారు ఆపత్కాలంలో సమయానికి స్పందించి పురుడు పోసిన 108 సిబ్బందిని కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు..