నిరుపేద కుటుంబంలో విరిసిన విద్య కుసుమం ఇరిగి సాయి చాందిని

దళిత సంఘాలు సన్మానం
గంభీరావుపేట ఏప్రిల్ 21 (జనం సాక్షి):

గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన తిరిగి సాయి చాందిని విడుదలైనటువంటి ఫలితాల్లో జేఈఈ మెయిన్స్ లో 27263 ర్యాంకు సాధించి గర్వకారణంగా నిలిచిం దని అభినందించారు. ఇరిగి పరశురాము లు ఉమా గార్ల కూతురు సాయి చాందిని బరియలగూడెంలో రాచర్ల జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన వారి తల్లిదండ్రులు ఆమెను ఈ పరీక్ష ఫలితాల్లో మెరుగైన ర్యాంకును సాధించి పెట్టడం చాలా గర్వకా రణంగా ఉందని వారు తెలిపారు. మంగళ వారం ఫలితాలు విడుదలైన సందర్భంగా మండలం దళిత సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థిని కి ఘన సన్మానం నిర్వహించా రు ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల
దండోర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కూడెల్లి ప్రవీణ్ కుమార్, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల అధ్యక్షులు బరుకుటం తిరుపతి మండల ప్రధాన కార్యదర్శి నరేష్ వర్మ, మాదిగ దండోరా మండల అధ్యక్షు డు గ్యార శంకర్ గారు, అంగూరు శ్రీనివా స్, దేవేందర్,అంబేద్కర్ సంఘ ప్రధాన కార్యదర్శి మిద్దెల శ్రీనివాస్, నాయకులు బండమీది తిరుపతి, ఎర్రోళ్ల బాలరాజు, శనిగారు శ్యామ్, అంగూరు శేఖర్ మరియు మహిళలు పాల్గొని విద్యార్థినికి గ్రామస్తులు అభినందనలు తెలిపారు.