గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న సరోజినీ ఏజెన్సీ కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలి..విధుల్లోకి తీసుకోవాలి

 

 

 

న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.. సరోజినీ ఏజెన్సీ కార్మికులు..

గంభీరావుపేట ఏప్రిల్ 08(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ లో సరోజినీ ఏజెన్సీ కాంట్రాక్ట్ బేసిక్ కింద 12 మంది కార్మికులను గత నాలుగు సంవత్సరాల క్రితం పనిలోకి తీసుకొని వారిని ఇలాంటి సమాచారం ఇవ్వకుండా ఆరుగురిని శానిటేషన్ కార్మికులను విధుల నుండి తొలగించారని ఏజెన్సీ కార్మికులు వాపోయారు, పనిచేసే వ్యక్తుల్ని ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా తీసివేశారు. సరోజినీ కాంట్రాక్ట్ అడగక గవర్నమెంట్ ఆరుగురిని తీసుకోవాలని తెలిపారు. అందుకే ఆరుగురిని వీటి నుండి తొలగించామని తెలిపారు. వారు వెంటనే జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు మాకు హాస్పిటల్లో పని కల్పించాలని ఆసుపత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత మండల వైద్యాధికారి సృజన్ కుమార్ వివరణ కోరగా శానిటేషన్ సిబ్బంది తో మాకు ఎలాంటి సంబంధం లేదని సరోజిని కాంట్రాక్టర్ కు సంబంధించిందనిబి తెలిపారు గతంలో 30 పడకల ఆసుపత్రికి శానిటేషన్ కింద పన్నెండు మందిని వీధుల్లోకి తీసుకోగా అందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు 15 పడగల ఆసుపత్రిగా ఉండడం 30 పడకలు రద్దు కావడంతో ఆరుగురిని తీసుకోవాలని కాంట్రాక్టర్ కు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా ఆరుగురిని వీధుల్లోకి రావాలని తెలుపగా మిగతా ఆరుగురిని విధుల్లో తీసేసినట్లు తెలిపారు . ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి సరోజిని కాంట్రాక్ట్ కింద 12 మందిని శానిటేషన్ కింద విధుల్లోకి తీసుకొని గంభీరావుపేట వాస్తవ్యులుగా ముగ్గురిని తీసుకోగా 9 మంది చుట్టుపక్క గ్రామాల నుండి విధుల్లో కాంట్రాక్టర్ తీసుకున్నాడని. గ్రామానికి సంబంధించిన ఆ ముగ్గురు వ్యక్తులను తీసేయడానికి ఏమిటని కాంట్రాక్టర్ను కార్మికులు నిలదీశారు అలాగే గత పది నెలల వేతనాలు ఇవ్వలేదని అన్నారు. సంబంధిత కాంట్రాక్టర్ మాకు విధుల్లోకి తీసుకొని పది నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ ఈ కార్యక్రమంలో సంబంధిత కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు

తాజావార్తలు