నల్లగొండ జిల్లా ఫోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు

మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసులో నిందితునికి 7 సంవత్సరాల జైలు శిక్ష:
నల్లగొండ ప్రతినిధి,ఏప్రిల్ 30,జనం సాక్షి:
గుంటూరు జిల్లా మాచర్ల కు చెందిన ఉప్పుతల దుర్గాప్రసాద్ నాగార్జునసాగర్ కు చెందిన మహిళను వివాహం చేసుకోవడం జరిగింది. ఆ మహిళకు గతంలోనే వివాహం జరిగి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సదరు మహిళా భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోగా పైన పేర్కొన్న దుర్గా ప్రసాద్ ని రెండవ వివాహంగా చేసుకున్నది. దుర్గాప్రసాద్ మరియు అతని భార్య ఈ ఇద్దరు కూతుర్లను తీసుకొని బతుకుతెరువు కోసం కోళ్ల ఫారంలో పనిచేయడానికి నార్కట్పల్లి మండలం కొండపాకొనిగూడెం వెళ్లడం జరిగింది. తేదీ ఏప్రిల్ 20 2018 రోజున నిందితుడు దుర్గాప్రసాద్ పైన పేర్కొన్న మహిళకు సంబంధించిన రెండవ కూతురైన 14 సంవత్సరాల మైనర్ బాలికను సాయంత్రం వేళ 7:30 గంటల ప్రాంతంలో తన యొక్క టు వీలర్ వాహనం పైన ఎక్కించుకొని కొండపాకొనిగూడెం గ్రామ శివారులోని రైల్వే ట్రాక్ దగ్గర వాహనం ఆపి సదరు మైనర్ బాలికను చెట్లపొదల్లోకి లాక్కొనిపోయి మానభంగం చేసే ప్రయత్నం చేశాడు.ఆ మైనర్ బాలిక గట్టిగా కేకలు వేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చింది. జరిగిన విషయం తన తల్లికి చెప్పడంతో ఆమె తన భర్త అయిన దుర్గాప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని 21 ఏప్రిల్ 2018 రోజున నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సమగ్రమైన దర్యాప్తు జరిపి అండర్ సెక్షన్ 504,506,9(I)(m)(n),10 ఫోక్సో ఆక్ట్ 2012 కేసుకు నమోదు చేయడం జరిగింది. సుదీర్ఘ విచారణ అనంతరం గురువారం నల్లగొండ జిల్లా పోక్సో న్యాయస్థానం నిందితునికి 7 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. 4000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. బాధిత మైనర్ బాలికకు 2 లక్షల రూపాయలు కంపెన్సేషన్ ప్రకటించింది. ఇట్టి కేసులో ప్రాసిక్యూషన్ తరపున సరైన సాక్షాలను, ప్రవేశపెట్టి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ బలమైన వాధలను వినిపించారు. సమగ్రమైన ఇన్విస్టిగేషన్ చేయడంలో ఆనాటి నార్కట్పల్లి ఎస్ హెచ్ ఓ, కే.గోవర్ధన్ ప్రస్తుత ఎస్ హెచ్ ఓ విష్ణు కీలకపాత్ర పోషించారు. సిడిఓ లు నరసింహ, కిరణ్ మరియు భరోసా లీగల్ ఆఫీసర్ మామిడి కల్పన ఈ కేసు పురోగతి సాధించడానికి సహకరించారు.



