శ్రీరంగాపూర్ మండలంలో మిషన్ భగీరథ నీటి నాణ్యత పై తీవ్ర ఆందోళన వ్యక్తం .

 

 

 

 

 

 

 

 

మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యత పై పలు గ్రామాల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు..

శ్రీరంగాపురం ఏప్రిల్ 26 జనం సాక్షి.శ్రీరంగాపూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు దారుణంగా నీరును ఫిల్టర్ చేయకుండా మిషన్ భగీరథ అధికారులు పర్యవేక్షణ లోపంతో ప్రస్తుతం నీరు తాగడానికి పనికిరాకపోతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు .ఈ నీటిని తాగాలా లేక ఇతర అవసరాలకు మాత్రమే వాడుకోవాలని ప్రజలు సందిగ్ధంలో ప్రజలు సతమతమవుతున్నారు. అధికార ఫిర్యాదు చేసిన స్పందన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామ సర్పంచులు మిషన్ భగీరథ ఏఈ కి ఫోన్ చేసి చెప్తే రెస్పాండ్ కావడం లేదని మరియు జర్నలిస్టు ఏఈ గారితో ఫోన్ లో మాట్లాడితే వారు ఏం రెస్పాండ్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేయడం జరిగింది. తిరిగి మళ్లీ ఫోన్లో చేయగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాక మండలంలో మీటింగ్ పెడతాము అక్కడికి రండి మాట్లాడదామని చెప్పడం జరుగుతుంది .కనీసం లక్షల కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు శుద్ధి చేయబడిన త్రాగునీరు ప్రజల అందించాలని లక్ష్యంతో మిషన్ భగీరథం ప్రభుత్వం ఏర్పాటు చేశారు, అధికారులు ఆ లక్ష్యాన్ని నీరు కారుస్తున్నారు. ఆరోగ్యానికి కాపాడుకోవడానికి స్వచ్ఛందంగా త్రాగునీరు అందించాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ మిషన్ భగీరథ లో వాటర్ ను తాగడానికి పనికి రాకపోవడంతో గ్రామాల ప్రజలు ఫిల్టర్ వాటర్ ను డబ్బులు పెట్టి కొనాల్సిన పరిస్థితికి రావడం జరుగుతుంది .ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఇకముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని మరియు కంబలాపూర్ గ్రామ సర్పంచ్ పి విజయ్ కుమార్ రెడ్డి మిషన్ భగీరథ అధికారులు జిల్లా కలెక్టర్ పై స్థాయి పై అధికారులను కోరారు.

తాజావార్తలు