మూగజీవాల మృత్యుఘోష

ఆసి ఫాబాద్ : రైలు ఢీకొని 170 గొర్రెలు, 10మేకలు మృతి చెందిన సంఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి వర్షం పడటంతో గొర్రెల కాపరులు నిద్రిస్తున్న సమయంలో.. గొర్రెలు ఒక్కసారిగా పక్కనే ఉన్న రైల్వే పట్టాలపై చేరుకున్నాయి. అంతలోనే రైలు ఢీకొని శీర్ష గ్రామానికి చెందిన జడ భీమయ్యకు చెందిన 170గొర్రెలు, 10మేకలు మృతిచెందాయి. ఉదయం చూసేసరికి రైల్వే పట్టాలపై చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. గొర్రెలను చూసి కుటుంబ సభ్యులు కన్నింటి పర్వంతమయ్యారు. ఆర్థికంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.