నేడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు

జాతర ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన గ్రామ పెద్దలు…
1.50 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేసిన చెన్నారావుపేట సొసైటీ మాజీ వైస్ చైర్మన్ ‘తొగరు’…
చెన్నారావుపేట, ఫిబ్రవరి 27 ( జనం సాక్షి): మండలంలోని కోనాపురం గ్రామంలోని గుట్టపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు నేడు శుక్రవారం జరగనున్నాయి. కోనాపురం గ్రామంలోని గుట్టపై స్వయంభుగా వెలసిన శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి దేవాలయంలో ప్రతి ఏడాది హోలీ పర్వదిన వేడుకలను పురస్కరించుకొని కళ్యాణ మహోత్సవ జాతర ఉత్సవాలను గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది కూడా 12వ వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా నేడు శుక్రవారం రాత్రి 8 గంటలకు కళ్యాణ మహోత్సవ వేడుకలను అత్యంత వైభోపేతంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అర్చకులు కసివొజ్జల శివకృష్ణచార్యులు వెల్లడించారు. గురువారం గ్రామ సర్పంచ్ మైదం రాకేష్, ఉప సర్పంచ్ మండల నరసింహారాములు, వార్డ్ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ యువకుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవ జాతర ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చెన్నారావుపేట సొసైటీ మాజీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు తొగరు చెన్నారెడ్డి 1.50 క్వింటాళ్ల బియ్యాన్ని భక్తుల అన్న ప్రసాదం కోసం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు పంపిణీ చేశారు. ఈ జాతర ఉత్సవాల్లో భాగంగా 27న శుక్రవారం రాత్రి 8 గంటలకు స్వామివారి కళ్యాణం, 3 మార్చి మంగళవారం హోలీ పర్వదినం రోజున జాతర (ప్రభ బండ్లు), 7న శనివారం స్వామి వారి రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.



