ఘనంగా శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం

గంభీరావుపేట ఏప్రిల్ 28(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో, అంగరంగ వైభవం గా శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం, ఆలయ చైర్మన్, నాగపురి శ్రీనివాస్ గౌడ్, ఆధ్వర్యంలో కనుల పండగ నిర్వహించారు, కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా, సర్పంచ్ నాగపురి బాలరాజ గౌడ్, హాజరై కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు, ఈ కళ్యాణ మహోత్సవం, శ్రీ శ్రీ రామాంజనేయ జీయర్ స్వామి, దివ్య మంగళ శాసనములతో ఆలయ అర్చకులు కొండమూరి హరి ప్రసాద్ గారితో, స్వామివారి కల్యాణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు, అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు, ఈ కళ్యాణ మహోత్సవానికి, దాతలుగా నిలిచిన వారికి, ఆలయ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కృతజ్ఞతలు తెలిపారు, మే నెల, రెండో తారీకు జరగబోయే రథోత్సవానికి, వివిధ గ్రామాల నుంచి భక్తులు హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలోఆలయ చైర్మన్ నాగపురి శ్రీనివాస్ గౌడ్,, బాల్రెడ్డి వైస్ చైర్మన్, సర్పంచ్ బాలరాజు గౌడ్, ఉప సర్పంచ్, ప్రియాంక, మాజీ ఎంపీపీ వంగ కరుణ సురేందర్, గుర్రం దేవ గౌడ్, జోగు రాజయ్య, రాజనర్సు, సంజీవ్, జగన్, ఆలయ కమిటీ, భక్తులు ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు



