కన్నుల పండుగగా శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం

గంభీరావుపేట మే02 (జనంసాక్షి):రాజన్నసిరిసిల్ల జిల్లా గంభరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవలు కన్నులపండుగ కొనసాగుతు న్నాయి అందులో భాగంగా శనివారం రోజు స్వామివారు భక్తులకు రథోత్సవం పై దర్శనమిచ్చారుశ్రీ రుక్మిణి సత్యభామ, సమేత నూతనపురి శ్రీ వేణుగోపాలస్వామి రథోత్సవంపై పురవీధుల గుండా ఊరోగింపులో ముందు చిన్నారులు దాండియా కోలాటాలు డీజే పాటలతో నృత్యాలు చేస్తూ భక్తులను కనువిందు చేస్తున్నారు స్వామివారికి మహిళలు మంగళారతులు తీసుకువచ్చి దర్శించుకుంటున్నారు. గ్రామంలో గోవిందా గోవింద నామస్మర ణలతో మారుమోగాయి, భక్తులు స్వామివారిని పెద్ద ఎత్తున దర్శించు కుని మొక్కలు చెల్లించుకుంటున్నారు. ముఖ్య అతిథులుగా, శివసేన రాష్ట్ర నాయకులు, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్, డాక్టర్ గణేష్ గౌటే, డీఎస్పీ నాగేంద్ర చారి, స్థానిక ఎస్సై అనిల్ కుమార్, గ్రామ సర్పంచ్ బాలరాజగౌడ్, ఉపసర్పంచ్ ప్రియాంక శ్రవణ్, ఆలయ కమిటీ సభ్యులు పాలకవర్గం హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు, వివిధ గ్రామా ల నుంచి భక్తులు పెద్ద మొత్తంలో పాల్గొని, మొక్కులు చెల్లించు కున్నారు, వేణుగోపాల స్వామి కృపాకటాక్షాలు భక్తులకు ఉంటా యని, వేద పండితులు తెలిపారు, ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ సింగిల్ విండో చైర్మన్ రాజనర్సింహారెడ్డి,ఆలయ చైర్మన్ నాగపురి శ్రీనివాస్ గౌడ్,, బాల్రెడ్డి వైస్ చైర్మన్, సర్పంచ్ బాలరాజు గౌడ్, ఉప సర్పంచ్, ప్రియాంక, మాజీ ఎంపీపీ వంగ కరుణ సురేందర్, గుర్రం దేవ గౌడ్, జోగు రాజయ్య, రాజనర్సు, సంజీవ్, జగన్, ఆలయ కమిటీ, ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు