మానేరులో గల్లంతైయిన వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సాయం
గంభీరావుపేట, సెప్టెంబర్ 02(జనం సాక్షి):
గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద గల్లంతైయిన వ్యక్తి కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసింది. అలాగే వరదలో చనిపోయిన పశువుల యజమానులకు పరిహారం చెక్కులను పంపిణీ చేసింది.
ఆర్ధిక సహాయం అందించి.. భరోసా కల్పించి..
గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద పంపుకాడి నాగయ్య మానేరు దాటుతూ గల్లంతు అయ్యారు. ఆయన ఆచూకీ కనిపెట్టేందుకు ఐదు శాఖల అధికారులు, సిబ్బందితో ఇప్పటికే వెతుకుతున్నారు. ఈ సందర్భంగా పంపుకాడి నాగయ్య భార్య లక్ష్మీకి రూ. ఐదు లక్షల విలువైన చెక్కును కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం అందజేశారు.
పశువుల యజమానులకు…
గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన గడ్డమీది మణెమ్మకు చెందిన రెండు పశువులు, ప్రవీణ్ గౌడ్ కు చెందిన ఒక పశువు వరదలో గల్లంతు అయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నష్ట పరిహారం చెక్కులు గడ్డమీది మణెమ్మకు రూ. లక్ష, ప్రవీణ్ గౌడ్ కు రూ. 50 వేల విలువైన చెక్కును జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అందజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ విజయ సిరిసిల్ల ఆర్డిఓ వెంకటేశ్వర్లు జిల్లా పశువుల సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి తాసిల్దార్ ఎంపీడీవో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.