ఆర్మూర్ లో తీన్మార్ మల్లన్న ప్రచారం

 

 

 

 

 

ఆర్మూర్, ఫిబ్రవరి 7 ( జనం సాక్షి)ఆర్మూర్ పట్టణంలోని పోచమ్మ గల్లి లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారంలో కార్నర్ మీటింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ బిజెపిలో నువ్వు దొంగ అంటే నువ్వు లంగా అంటూ ఒకరు తిట్టుకునే అందుకే మనం ఓటేసామని ప్రజలను ప్రశ్నించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన ఆడబిడ్డల ఆదుకోవడమే లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరిని లాగు లో తొండలు ఇరుస్తానంటాడు.ఇంకొకడు చెప్పుతోని కొడతానని అంటున్నారని ఎద్దేవా చేశారు.రాబోయే ఎన్నికల్లో రాజ్యాధికారం పార్టీ ప్రజల ముందుకు వస్తుందని భరోసా ఇచ్చారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి లక్ష్మణ్ భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలకు పిలుపునిచ్చారు.