నిందితులను కఠినంగా శిక్షించాలి

 

 

 

 

-టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్

సూర్యాపేట(జనంసాక్షి):నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర మల్లన్న జాతరలో శిశువు మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ డిమాండ్ చేశారు.సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలో టీఆర్పీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం నుండి కొత్త బస్టాండ్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలపై అగ్రకుల దాడులు ఇంకెన్నాళ్లని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి ఘటన జరగడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు.దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.బాధిత కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్,పార్టీ జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, జిల్లా కార్యదర్శి మీర్ అక్బర్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు చాంద్ పాషా, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల గౌడ్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏశబోయిన మల్లేష్ యాదవ్, సూర్యాపేట మండల అధ్యక్షుడు సోమగాని లింగస్వామి గౌడ్, ఆత్మకూర్ (ఎస్)మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, పెన్ పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య యాదవ్, యగ్గడి మురళి, మామిడి శోభన్, తగుళ్ల జనార్ధన్, భారీ అశోక్, లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.