రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
బొంరాస్ పేట, మే 3(జనం సాక్షి): రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు.ఆదివారం మండల పరిధిలోని మెట్లకుంట రైతు వేదిక సమీపంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు ,రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలోని ఏ గ్రామానికి అయినా వెళదామని 100% రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే ,వచ్చే ఎన్నికల్లో కోడంగల్ నుండి బిఆర్ఎస్ పార్టీ పోటీ చేయదని సవాల్ విసిరారు.రాత్రి,పగలు తేడా లేకుండా రైతులు వడ్లకుప్పల దగ్గర పడిగాపులు కాస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో బొంరాస్ పేట, దుద్యాల మండలాల పార్టీ అధ్యక్షులు కోట్ల యాదగిరి,చాంద్ పాషా, సర్పంచులు సుదర్శన్ రెడ్డి,హిరు నాయక్, మండల నాయకులు మహేందర్ రెడ్డి, నారాయణరెడ్డి,రవి గౌడ్,లగచర్ల సురేష్,శ్రావణ్ గౌడ్,మల్లేష్ గౌడ్, రవికుమార్ గౌడ్, రమణారెడ్డి,జలీల్, బండ శ్రీనివాస్,కార్యకర్తలు రైతులు ఉన్నారు.



