కనుముక్కులలో ఘనంగా తిరుకళ్యాణ మహోత్సవం

 

 

 

 

 

 

భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 25 (జనం సాక్షి):మండలంలోని కనుముక్కుల గ్రామంలో శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు కోట మల్లారెడ్డి, పుష్పలత ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య హోమం, శ్రీ సూక్త హవనం, పూర్ణాహుతి అనంతరం స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ముఖ్యతిధులుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి,బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి క్యామ మల్లేష్, సినీనటుడు శివాజీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చుక్క శోభ శంకర్, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.