సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం

– మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు

భూదాన్ పోచంపల్లి, మార్చి 10 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణ కేంద్రంలోని వినోబా మందిరం నుండి పోలీస్ స్టేషన్ వరకు 5కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు మహిళా కౌన్సిలర్లు, మహిళా ఉద్యోగులు, ఆర్‌పీలు, పారిశుద్ధ్య మహిళా సిబ్బందిని శాలువాలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంజన్ రెడ్డి, ఎస్సై లైలా, వైస్ చైర్మన్ కొయ్యడ రజిని శ్రీనివాస్, కౌన్సిలర్లు శ్రీరామ్ మంజుల లింగస్వామి, కొండమడుగు ఎల్లస్వామి, రావుల జంగయ్య,కర్నాటి వరలక్ష్మి నరసింహ, రాపోలు కావ్య వేణు, దేవరాయ కుమార్, జింకల లావణ్య యాదగిరి, కుడికాల అఖిల బలరాం, సూరేపల్లి రాధిక రమేష్, మేనేజర్ నిర్మల, సీ-అసిస్టెంట్లు రాజేశ్, ఆదిత్య, మైథిలి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు