గన్నేరువరం మండల శాఖ ఆధ్వర్యంలో టిఫిన్ బైఠక్
● రేపు స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – బిజెపి మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్
గన్నేరువరం, జూన్ 12 (జనంసాక్షి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ఆదేశానుసారం భారతీయ జనతా పార్టీ గన్నేరువరం మండలం శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున స్థానిక హై స్కూల్ గ్రౌండ్ గన్నేరువరం లో టిఫిన్ బైఠక్ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో మండల అధ్యక్షులు తిప్పర్తి నికేష్ పాల్గొని పార్టీ నాయకుల కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేపు అనగా 13-06-2026న నిర్వహించనున్న స్వచ్ పాఠశాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పాఠశాలల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, విద్యార్థులకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన విద్యా వాతావరణం కల్పించడం సమాజం యొక్క బాధ్యత అని అన్నారు. అలాగే స్థానిక ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి, పాఠశాలల పరిశుభ్రత, అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. సమాజంలోని ప్రతి వ్యక్తి పాఠశాలల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తే భావితరాలకు మెరుగైన విద్యా వాతావరణం అందించగలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ అరికాంతపు అనిల్, మచ్చ బాలరాజు, మండల ప్రధాన కార్యదర్శిలు పుల్లెల రాము, బొమ్మడి సురేందర్ రెడ్డి, కార్యదర్శి బూట్ల సంపత్, కార్యవర్గ సభ్యులు జాలి శ్రీనివాసరెడ్డి నందికొండ సురేందర్ రెడ్డి,బీజేపీ సీనియర్ నాయకుడు మునిగంటి లింగయ్య, కార్యకర్తలు గట్టు కిషన్, బోగిని వేణు, చింతల శ్రీనివాస్, బోయిని మధు తదితరులు పాల్గొన్నారు.



