రేపు కీ.శే. చర్లకొల శ్వేత రెడ్డి ప్రథమ వర్ధంతి:హాజరుకానున్న బిఆర్ఎస్ ప్రముఖులు
జడ్చర్ల, సెప్టెంబర్ 8 (జనంసాక్షి): మాజీ మంత్రి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు డా. సి. లక్ష్మారెడ్డి సతీమణి కీ.శే. శ్వేత రెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమం రేపు నిర్వహిస్తున్నట్లు బిఆర్ఎస్ పార్టీ జడ్చర్ల నియోజకవర్గం సభ్యులు, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య తెలిపారు. సోమవారం బిఆర్ఎస్ నాయకులు, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య మీడియాకు తెలుపుతూ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా రెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారని, మొదటగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీ పేట మండలం ఆవంచ గ్రామంలో ఉదయం 11.00 గంటలకు కీ.శే.చర్లకొల శ్వేత విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జడ్చర్ల పట్టణంలోని ప్రేమ్ రంగా గార్డెన్స్ లో నిర్వహించే ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇట్టి కార్యక్రమాలలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.