పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి

ఉర్కొండ ఏప్రిల్ 22, ( జనం సాక్షి ) ;అకాల వర్షంతో పిడుగుపాటుకు రెండు జెర్సీ ఆవులు మృతి చెందిన సంఘటన మండలములో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలంలోని బాల్యంలోకి తండా గ్రామ పంచాయతీలో కేతవత్ చంద్య నాయక్ అనే రైతుకు చెందిన రెండు జెర్సీ ఆవులు మంగళవారం రాత్రి జరిగిన అకాల వర్షం పిడుగుపాటుకు రెండు ఆవులు అక్కడికక్కడే మరణించాయి. తనకు జీవనాధారమైన ఆవులతో రైతు వ్యవసాయం చేసి తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తనకు తిండికి పెట్టే ఆవులు మరణించడంతో ఆ రైతు కుటుంబం కన్నీరు మున్నీరయింది. దాదాపు లక్ష యాభై వేల విలువ గల ఆవులు అకస్మాత్తుగా మరణించడంతో ఆ రైతు కుటుంబం రోడ్డున పడినట్లు అయింది. ప్రకృతి వైపరీత్యం వల్ల ఆవులు చనిపోయిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తండావాసులు రైతులు కోరుతున్నారు.